ఆ నిధులకు చట్టబద్ధత హర్షణీయం
The legitimacy of those funds is appreciating
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కంపోనెంట్ నిధుల వినియోగానికి చట్టబద్ధత పదేళ్ల పాటు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం హర్షణీయం. ఉప ప్రణాళిక నిధులకు 2013లో కల్పించిన చట్టబద్ధత ముగిసినందున అత్యవసర ప్రాతిపదికన ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా చట్టం నిర్వీర్యం కాకుండా జాగ్రత్త పడినట్లయింది. శాసనసభ సమావేశాల్లో అందుకు తగిన చట్టాన్ని ప్రవేశపెట్టి, ఆమోదం పొందే వరకు ఈ ఆర్డినెన్స్ అమలులో ఉంటుంది. కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో ప్రణాళిక, ఉపప్రణాళిక తరహా విభజనలకు మంగళం పాడినప్పటి నుండి వీటిని 'కంపోనెంట్' నిధులుగా వ్యవహరిస్తున్నారు.
అయితే వీటిని ఏ పేరుతో వ్యవహరించినా బలహీన వర్గాలకు జనాభా దామాషా పద్దతిలో కేటాయింపులు ఉండాలి. విడుదలైన నిధుల్ని దారి మళ్లించకుండా, మురిగిపోయి వెనక్కి పోయేలా కాకుండా ఈ చట్టబద్ధత కాపాడుతుంది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి, సమగ్ర అభివృద్ధికి, నిర్దేశించిన పథకాల ద్వారా ఖర్చుపెట్టేలా ప్రభుత్వాన్ని జవాబుదారీ చేస్తుంది. ఏ కారణంతో నైనా ఖర్చు కాని నిధులు తర్వాత సంవత్సరంలో కూడా అందుబాటులోకి వస్తాయి. ఆయా వర్గాల అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ చట్టం పదేళ్లు కొనసాగేలా నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు. కేంద్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ నిధులకు ఈ తరహా చట్టబద్ధత కల్పించడం అవసరం.
డా. డి.వి.జి.శంకర్ రావు,
94408 36931