ప్రవాసుల సంక్షేమంపై నిబద్ధత చూపించండి!

1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరిగి వచ్చిన రోజు గుర్తుగా జరుపుకునే ఈ రోజును

Update: 2025-01-09 00:30 GMT

1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరిగి వచ్చిన రోజు గుర్తుగా జరుపుకునే ఈ రోజును, ప్రవాసుల తోడ్పాటును గౌరవించేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందు కు ఇది ఒక ముఖ్యమైన వేదిక.

ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నప్పటికీ..

ప్రవాసులు దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2023లో వారు పంపిన డబ్బు $125 బిలియన్ డాలర్లు (రూ. 10,25,000 కోట్లు). ఈ నిధులు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయ డమే కాకుండా, వలసదారుల కుటుంబాలకు విద్య, ఆరోగ్యం, ఆస్తులలో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడుతున్నాయి. ప్రవాసులు కేంద్ర బడ్జెట్‌కు ₹1,10,700 కోట్లు, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కు ₹5,940 కోట్లు ఆదాయంగా తీసుకువస్తున్నారు. ప్రవాసులు దేశానికి అనేక విధాలుగా తోడ్పడినప్పుడు, ప్రభుత్వాలు వారి భద్రత, గౌరవం, సంక్షేమం పట్ల సమగ్రమైన నిబద్ధత చూపించాలని కోరుతున్నాం. వీరి కోసం భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేసినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా విదేశాలలో జైలు పాలై శిక్షలను ఎదుర్కొంటున్న గణేశ్, నర్సయ్య, ఈశ్వర్ రెడ్డి లాంటి వారికి బలమైన న్యాయ సహాయం అవసరం. భూమయ్య, జరీనా బేగం, అవేజ్ కుటుంబాలకు తిరిగి సమాజంలో విలీనం అవ్వడానికి పునరావాస కార్యక్రమాలు అవసరం. ప్రవాసుల పంపిన డబ్బు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైనది. ప్రవాసి భారతీయ దివస్ జరుపుకుంటున్న సమయంలో, వారి సేవలను గౌరవించడం మాత్రమే కాకుండా, వారి సమస్యలను నిజాయితీగా పరిష్కరించడం మన బాధ్యత.. ప్రవాసులు దేశానికి అనేక విధాలుగా తోడ్పడినప్పుడు, ప్రభుత్వాలు వారి భద్రత, గౌరవం, సంక్షేమం పట్ల సమగ్రమైన నిబద్ధత చూపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని, ప్రవాసుల సంక్షేమం కోసం మరింత సమగ్రంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

(8,9,10 తేదీల్లో ప్రవాసి భారతీయ దివస్ 2025 సందర్భంగా)

గంగుల మురళీధర్ రెడ్డి

ఉపాధ్యక్షులు, తెలంగాణ గల్ఫ్ జేఏసీ

93915 60033

Tags:    

Similar News