కేసీఆర్ ప్రజలను కాదు పైసల్ని నమ్ముతాడు : ఈటల సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురవారం ఆయన అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్నారని ఆరోపించారు. జగన్ ఓదార్పు యాత్రకు మద్దతిచ్చిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ల దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో జనం అర్థం చేసుకోవాలని కోరారు. […]

Update: 2021-08-05 00:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురవారం ఆయన అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్నారని ఆరోపించారు. జగన్ ఓదార్పు యాత్రకు మద్దతిచ్చిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ల దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో జనం అర్థం చేసుకోవాలని కోరారు.

కేసీఆర్ ప్రజలను కాకుండా పైసల్ని నమ్ముతాడు. హుజురాబాద్‌లో రూ. 150కోట్ల నగదు పంపిణీ చేశారని ఆరోపణలు చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదు. తాజాగా దళితు బంధు అంటూ కొత్త నాటకానికి తెరలేపారని ఈటల విమర్శల వర్షం కురిపించారు.

 

Tags:    

Similar News