బీజేపీకి షాకిచ్చిన ఈటల రాజేందర్..?

దిశ ప్రతినిధి, కరీంనగర్: భవిష్యత్తు కార్యచరణ త్వరలో ప్రకటిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఆయన బీజేపీలో చేరుతారాని ప్రచారం జరిగినప్పటికీ ఆయన మాత్రం స్పష్టత ఇవ్వలేదు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసిన ఈటల కమలం గూటిలో చేరడం దాదాపు ఖాయమై పోయిందన్న సంకేతాలు ఇచ్చారు. అనూహ్యంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాత్రం ఆయన బీజేపీలో చేరే విషయంపై స్పందించకపోవడం విశేషం. దీంతో ఆయన భవిషత్యులో […]

Update: 2021-06-04 00:56 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: భవిష్యత్తు కార్యచరణ త్వరలో ప్రకటిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఆయన బీజేపీలో చేరుతారాని ప్రచారం జరిగినప్పటికీ ఆయన మాత్రం స్పష్టత ఇవ్వలేదు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసిన ఈటల కమలం గూటిలో చేరడం దాదాపు ఖాయమై పోయిందన్న సంకేతాలు ఇచ్చారు. అనూహ్యంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాత్రం ఆయన బీజేపీలో చేరే విషయంపై స్పందించకపోవడం విశేషం. దీంతో ఆయన భవిషత్యులో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నదే సస్పెన్స్‌గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణాలు చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రకటించారు. ఈ రోజు నుండి తనతో పాటు కలిసి వచ్చే వారి చేరికలు ఉంటాయన్నారు. ఇక మీదట ఆయన పక్షాన చేరినవారినే ఈటల వర్గంగా ప్రకటించాల్సిన పరిస్థితి తయారుకానుంది.

బీజేపీకి షాక్..?

ఈటల రాజేందర్ రాజీనామాతో పాటు బీజేపీలో చేరే విషయంపై ప్రకటన చేస్తారని ఆ పార్టీ వర్గాలు ఆలోచించాయి. కానీ, ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం కలమనాథులను మింగుడు పడకుండా చేసింది. అన్ని రకాలుగా చర్చలు జరిపినా రాజేందర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న చర్చ బీజేపీలో మొదలైంది. ఆయన చేరుతారన్న ఆశతో అదిష్టానంతో అపాయింట్‌మెంట్ కోసం తాము పడ్డ శ్రమంతా వృథా కాబోతుందాన్న అన్న అంతర్మథనంలో బీజేపీ నాయకులు పడిపోయారు. క్లారీటీ ఇచ్చిన తరువాతే తీసుకెళ్లినప్పటికీ చివరి నిమిషంలో ఈటల బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించకపోవడం బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని విస్మయపరిచింది.

7 తరువాత ఏం చేస్తాడో..

తుది నిర్ణయం ఈ నెల 7 తరువాత ప్రకటిస్తానని రాజేందర్ ప్రకటించారు. అప్పటి వరకు ఎలాంటి సమీకరణాలు మారుతాయోనన్న చర్చ కూడా మొదలైంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ బీజేపీలో స్టార్ట్ అయింది.

Tags:    

Similar News