శక్తిపీఠం మీద ఆన.. తొక్కి నార తీస్తా: పవన్ కల్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

Update: 2025-01-10 12:57 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో లా అండ్ ఆర్డర్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తొక్కి నార తీస్తానని ఆయన హెచ్చరించారు. శక్తిపీఠంపై ఒట్టి పెట్టి చెబుతున్నానని, తాను చాల స్పష్టంగా ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండాలన్నారు. అధికారం అలంకారం కాదని, బాధ్యతగా ఉండాలని పవన్ తెలిపారు.

తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede) ఘటనపై పవన్ కల్యాణ్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై బాధితులకు ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు. అధికారులు కూడా క్షమాపణ చెప్పాల్సిందేనని ఆదేశించిన పవన్ నామోషి ఎందుకని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్న ఆయన తొక్కిసలాట ఘటనకు అధికారులే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News