AP: పుష్పా మాదిరి స్మగ్గింగ్.. రూ. కోటి విలువైన సరుకు పట్టివేత
ఏపీలో పుష్పా లాంటి ఘటన కలకలం రేపింది..
దిశ, వెబ్ డెస్క్: ఏపీ పుష్పారాజ్‌లు ఎక్కువ అయ్యారు. పుష్పా సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే రియల్ లైఫ్‌లో కొందరు దుండగులు ఒకటి, కాదు ఏకంగా వందల కిలోల గంజాయిని తరలించేస్తున్నారు. విశాఖ జిల్లా నుంచి ఎక్కడికి కావాలన్నా గంజాయి పంపిస్తున్నారు. అయితే రవాణా చేసే వాళ్లు అరెస్ట్ అవుతున్నారు. కానీ అసలు సూత్ర, పాత్ర దారులు మాత్రం తప్పించుకుంటున్నారు. అసలు గంజాయి ఎవరికి తరలిస్తున్నారనే విషయం బయటకు రావడంలేదు. తాజాగా భారీగా గంజాయి తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతమూరులో జరిగింది. అరకు నుంచి సాలూరుకు వెళ్తున్న రెండు వాహనాలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 671 కిలోల గంజాయిని గుర్తించారు. పట్టుకున్న సరుకు విలువ రూ. కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు.