కోడి పందేలకు సర్వం సిద్ధం... చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు
కోడి పందేలకు సర్వం సిద్ధమైన వేళ చివరి నిమిషంలో హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది..
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సంక్రాంతి(Sankranti) అంటే ముందుగా గుర్తొచ్చేది కోడి పందేలు (Cock Fight). పండగ రోజులన్నీ బరులతో గడిచిపోతాయి. ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరులో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కోట్ల కొద్దీ డబ్బులు బెట్టింగ్ రూపంలో చేతులు మారిపోతాయి. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఓ ఊరికి మాత్ర చాన్స్ లేదు. కోడి పందేలకు హైకోర్టు(Highcourt) బ్రేక్ వేసింది. కొత్తూరు తాడేపల్లిలో గత అనుభావాల దృష్ట్యా జలమయ్య అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కోడి పందేలను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కొత్తూరు తాడేపల్లిలో కోడి పందేలు జరగకుండా చూడాలని పోలీసులకు ఆదేశించింది. దీంతో పండగ నాలుగు రోజులు ఆ ఊరి ప్రజలు కోడి పందేలకు దూరం ఉండాల్సిందే.