వైఎస్‌‌ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తపాలెంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు పడగొట్టారు.

Update: 2025-01-10 15:07 GMT

దిశ ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తపాలెంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు పడగొట్టారు. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే విగ్రహం తల భాగం, చెయ్యి ధ్వంసం చేశారు. ఆ సమయంలో మొగల్తూరు పోలీసులు ముందు జాగ్రత్తగా కొత్తపాలెంలో సుమారు రెండు నెలలపాటు పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.

తాజాగా విగ్రహానికి ఎదురుగా అర్ధరాత్రి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసిన వారే విగ్రహాన్ని పడగొట్టి ఉంటారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుమానిస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం కూల్చివేత పై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని విగ్రహాలు పడగొట్టే సంస్కృతి సాంప్రదాయం సరైంది కాదని వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని అటువంటి మహానేత విగ్రహాన్ని కూల్చడం దారుణమని అంటున్నారు.

Tags:    

Similar News