Undi: కాసేపట్లో లోకేశ్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పర్యటిస్తారు
దిశ ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం(నేడు) పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఉదయం 7.30 గంటలకు ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి లోకేష్ బయలుదేరి ఉదయం 10 గంటలకు ఉండి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంకు చేరుకుంటారు. ఇటీవల పునర్నిర్మించిన హైస్కూల్ భవనాలను మంత్రి లోకేశ్ ప్రారంభిస్తారు. అనంతరం కాళ్ల మండలం పెద అమీరం చేరుకుని పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 11.45 గంటలకు భీమవరం రూరల్ మండలం చిన అమీరంలోని ఎస్.ఆర్.కె. ఆర్. ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణానికి చేరుకుని అక్కడ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు లోకేశ్ భీమవరం నుంచి బయలుదేరి 6.30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.