Telangana ACB: మచిలీపట్నంలో సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గ్రీన్ కో ఎనర్జీ కార్యాలయం(Greenko Energy office)లో తెలంగాణ ఏసీబీ అధికారులు(Telangana ACB) సోదాలు నిర్వహిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గ్రీన్ కో ఎనర్జీ కార్యాలయం(Greenko Energy office)లో తెలంగాణ ఏసీబీ అధికారులు(Telangana ACB) సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి దాదాపు 15 మంది అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫార్ములా ఈకార్ రేసు కేసులో గ్రీన్ కో సంస్థ కీలక ఉన్న సంగతి తెలిసిందే. కంప్యూటర్‌లతో పాటు హార్డ్ డిస్క్‌లను కూడా ఏసీబీ పరిశీలిస్తోంది. గ్రీన్ కో ఎనర్జీ ఆఫీస్‌కు వచ్చిపోయే వారిపై ఆరా తీస్తున్నారు. బ్యాంక్ లాకర్ల వివరాలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఫార్ములా-ఈ రేస్(Formula-E Case) ఒప్పందానికి ముందు గ్రీన్ కో సంస్థ ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీఆర్‌ఎస్ పార్టీకి రూ.41 కోట్ల వరకు ఇచ్చారనే అభియోగాలపై తెలంగాణ ఏసీబీ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన ఫైళ్లు, ఇతర వివరాలు, అనుబంధ పత్రాలు వంటి వాటిని సేకరించేందుకు మచిలీపట్నం కార్యాలయంలో తనిఖీలు జరుపుతున్నారు.