Bjp Trolls: పత్తా లేని పెద్ద మనిషి

మాజీ సీఎం కేసీఆర్ కనబడుట లేదని తెలంగాణ బీజేపీ నేతలు టోల్స్ చేస్తున్నారు.....

Update: 2025-01-08 12:31 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం కేసీఆర్ కనబడుట లేదని తెలంగాణ బీజేపీ నేతలు టోల్స్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించపోవడంతో సెటైర్స్ వేస్తున్నారు. తన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ అని, హోదా పతిపక్ష నేత అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విమర్శలు కురిపించారు. పత్తా లేని మనిషి, అధికార, భోగానికే గానీ, ప్రజల బాదర బందీలపై పట్టించుకోరా అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. ‘‘పదేళ్ల పాటు అనుభవించి, తెలంగాణను దోచుకున్న ఈయన, ఓడించి ప్రతిపక్షంలో కూర్చోపెడితే, కాంగ్రెస్ అక్రమాలను ప్రజల తరపున ప్రశ్నించకుండా పత్తా లేకుండా పోయిండు.’’ అంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసీఆర్ ఫొతో కూడిన పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ వైరల్ అయింది. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలపై ఎదురు దాడి చేస్తున్నారు. 


Similar News