TGPSC : మే 1 నుంచి కొత్త జాబ్ నోటిఫికేషన్స్ : టీజీపీఎస్సీ

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) నిరుద్యోగులకు భారీ గూ న్యూస్ తెలిపింది.

Update: 2025-01-08 12:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్స్(New Job Notifications) ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మార్చి 31 లోగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలను తమకు అందజేయాలని కోరింది. ఏప్రిల్ లో ఆ ఖాళీల మీద కసరత్తు చేసి.. మే 1 నుంచి వరుస నోటిఫికేషన్స్ ఇవ్వనున్నట్టు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) వెల్లడించారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన 5 నుంచి 6 నెలల్లోనే వాటి ప్రక్రియలు పూర్తి చేసి, నియామక పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. టీజీపీఎస్సీ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇదే విధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ.. ఉద్యోగాల భర్తీ చేపడితే తమకు ఎంతో మేలు చేకూరుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Tags:    

Similar News