Yadagirigutta : యాదగిరిగుట్టలో 10నుంచి15వరకు అధ్యయనోత్సవాలు
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి(Yadagiri Gutta Lakshminarasimha Swamy) దేవస్ధానం(Temple) నందు ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవా(Adhyayanotsavalu)లు నిర్వహించనున్నట్లుగా దేవస్థానం ఈవో భాస్కర్ రావు(EO Bhaskar Rao)తెలిపారు
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి(Yadagiri Gutta Lakshminarasimha Swamy) దేవస్ధానం(Temple) నందు ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవా(Adhyayanotsavalu)లు నిర్వహించనున్నట్లుగా దేవస్థానం ఈవో భాస్కర్ రావు(EO Bhaskar Rao)తెలిపారు. అధ్యయనోత్సవాల తొలి రోజు 10వ తేదీన శుక్రవారం ఉదయం 5:30లకు స్వామివారికి గరుడ వాహనం పైన వైకుంఠ నాధుడి అలంకార సేవ, సాయంత్రం 6గంటలకు శ్రీ మత్స్యావతారం అలంకార సేవ, 11వ తేదీ శనివారం ఉదయం 9గంటలకు శ్రీ వేణుగోపాలకృష్ణ అలంకారం సేవ, సాయంత్రం 6గంటలకు గోవర్ధన గిరిధారి అలంకార సేవ నిర్వహిస్తారు.
12న ఆదివారం ఉదయం 9గంటలకు శ్రీ రామావతారం, సాయంత్రం 6గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార సేవ, 13న సోమవారం ఉదయం9గంటలకు శ్రీ వెన్న కృష్ణుడి అలంకార సేవ, సాయంత్రం 6 గంటలకు కాళీయ మర్ధనుడి అలంకార సేవ, 14 మంగళవారం ఉదయం 9గంటలకు శ్రీ వటపత్ర శాయి అలంకారం, సాయంత్రం 6గంటలకు శ్రీ వైకుంఠనాథుడి అలంకార సేవ, పరదపద ఉత్సవం నిర్వహిస్తారు. 15వ తేదీ బుధవారం ఉదయం 9గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అలంకార సేవ, అధ్యయనోత్సవాల పరిసమాప్తి నిర్వహిస్తారు.
అధ్యయనోత్సవాలు జరిగే ఆరు రోజుల పాటు శ్రీ సుదర్శన నారసింహ హోమం, నిత్య శాశ్వత కళ్యాణం, నిత్య శాశ్వత బ్రహ్మోత్సవాలు, జోడు సేవలు రద్దు చేస్తున్నట్లుగా ఈవో భాస్కర్ రావు తెలిపారు.
అటు ఈ నెల 10వ తేదీన స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఉదయం 5:15గంటలకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నామన్నారు. ఈ రోజు నిత్య కైంకర్యాల్లో మార్పులుంటాయని తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించే లక్ష పుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు.