తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ బ్యాచ్ పోలీసులకు గుడ్ న్యూస్

సంక్రాంతి(Sankranthi) పండుగ సమీపిస్తోన్న వేళ ఏఎస్‌ఐలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Update: 2025-01-10 13:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి(Sankranthi) పండుగ సమీపిస్తోన్న వేళ ఏఎస్‌ఐలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1989, 1990 బ్యాచ్‌కు చెందిన పోలీసుల(Telangana Police)కు పదోన్నతి కల్పించింది. హైదరాబాద్ రీజియన్‌లోని 187 ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా ప్రమోషన్ ఇచ్చింది. ఈ మేరకు డీజీపీ జితేందర్(DGP Jitender) ఆదేశాలకు మేరకు ప్రమోషన్లు ఇస్తూ మల్టీ జోన్ - 2 ఐజీపీ సత్యనారాయణ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఆ 187 మంది ఏఎస్సైలు తాజాగా ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే వారికి పదోన్నత్తులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News