కొన్ని రోజుల పాటే మినీ మూన్

దిశ, వెబ్‌డెస్క్: భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ఓ ఖగోళ అంశాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీనికి మినీ మూన్ అని, భూగ్రహానికి రెండో చంద్రుడు అని అంటున్నారు. కానీ అది ఒక ఆస్టరాయిడ్. కారు పరిమాణంలో ఉన్న దీని వ్యాసం 1.9 నుంచి 3.5 మీ.ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మన చందమామ లాగ ఈ మినీ మూన్ శాశ్వతం కాదు. కేవలం కొద్ది రోజులు మాత్రమే భూకక్ష్యలో తిరిగి మళ్లీ దాని దారిలో అది వెళ్లిపోతుంది. […]

Update: 2020-02-28 00:28 GMT

దిశ, వెబ్‌డెస్క్:
భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ఓ ఖగోళ అంశాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీనికి మినీ మూన్ అని, భూగ్రహానికి రెండో చంద్రుడు అని అంటున్నారు. కానీ అది ఒక ఆస్టరాయిడ్. కారు పరిమాణంలో ఉన్న దీని వ్యాసం 1.9 నుంచి 3.5 మీ.ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మన చందమామ లాగ ఈ మినీ మూన్ శాశ్వతం కాదు. కేవలం కొద్ది రోజులు మాత్రమే భూకక్ష్యలో తిరిగి మళ్లీ దాని దారిలో అది వెళ్లిపోతుంది.

ఫిబ్రవరి 15న నాసా వారి అరిజోనా కేంద్రం కేటలీనా స్కై సర్వే (సీఎస్ఎస్)లో పనిచేస్తున్న కేస్పర్ వీయర్జోస్, టెడ్డీ ప్రుయనేలు ఈ మినీ మూన్‌ని కనిపెట్టారు. దీనికి 2020 సీడీ3 అని సాంకేతికంగా నామకరణం చేశారు. దీనిని కనిపెట్టడాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ వారి ద మైనర్ ప్లానెట్ సెంటర్ ఆమోదించింది. కక్ష్యల కలయిక వల్ల ఈ ఆస్టరాయిడ్ తాత్కాలికంగా కనిపిస్తుందని మైనర్ ప్లానెట్ సెంటర్ పేర్కొంది.

భూకక్ష్యతో ఆస్టరాయిడ్ కక్ష్య కలిసిపోయినపుడు కొన్నిసార్లు ఆస్టరాయిడ్ భూమి వైపుకు బలంగా ఆకర్షణకు గురవుతుంది. 2020 సీడీ3 విషయంలో కూడా అదే జరిగింది. ఇలాంటి ఆస్టరాయిడ్లు కొద్ది రోజుల పాటు భూమి చుట్టూ తిరిగి తర్వాత కనిపించకుండా పోతాయి. వీటిని టెంపరరీలీ క్యాప్చర్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. చంద్రుని, సూర్యుని గురుత్వాకర్షణల కారణంగా వీటి గమనం అస్తవ్యస్తంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సీఎస్ఎస్ వారు కనిపెట్టిన రెండో ఆస్టరాయిడ్ ఇది. గతంలో 2006 ఆర్‌హెచ్ 120 అనే ఆస్టరాయిడ్‌ను వీరు గుర్తించారు. ఇది 2007లో కనిపించకుండా పోయింది.

Tags:    

Similar News