అమెరికా సర్జన్ జనరల్‌గా డాక్టర్ వివేక్ మూర్తి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ టీమ్‌లోకి మరో ప్రవాస భారతీయుడు చేరారు. అమెరికా సర్జన్ జనరల్‌గా ఇండియన్ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని బైడెన్ నియమించారు. హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ కార్యదర్శి జేవియర్ బసెర్రా నేతృత్వంలోని ఈ బృందంలోకి చేరనున్న డాక్టర్ వివేక్ మూర్తి యూఎఎస్‌లో కరోనాపై పోరులో కీలకంగా వ్యవహరించనున్నారు. ఇందులో బైడెన్‌కు సలహాదారుగా కొనసాగుతారు. వివేక్‌కు ఫిజిషియన్‌గా, శాస్త్రజ్ఞుడిగా, పబ్లిక్ హెల్త్ సర్వీస్ కమిషన్డ్ కార్ప్స్‌లో రెండు దశాబ్దాల అనుభవమున్నది. […]

Update: 2020-12-09 09:01 GMT

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ టీమ్‌లోకి మరో ప్రవాస భారతీయుడు చేరారు. అమెరికా సర్జన్ జనరల్‌గా ఇండియన్ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని బైడెన్ నియమించారు. హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ కార్యదర్శి జేవియర్ బసెర్రా నేతృత్వంలోని ఈ బృందంలోకి చేరనున్న డాక్టర్ వివేక్ మూర్తి యూఎఎస్‌లో కరోనాపై పోరులో కీలకంగా వ్యవహరించనున్నారు.

ఇందులో బైడెన్‌కు సలహాదారుగా కొనసాగుతారు. వివేక్‌కు ఫిజిషియన్‌గా, శాస్త్రజ్ఞుడిగా, పబ్లిక్ హెల్త్ సర్వీస్ కమిషన్డ్ కార్ప్స్‌లో రెండు దశాబ్దాల అనుభవమున్నది. ఒబామా హయాంలోనూ అమెరికా సర్జన్ జనరల్‌గా సేవలందించిన వివేక్ మూర్తి ట్రంప్ అధికారంలోకి రావడంతో అర్ధంతరంగా తొలగిపోయారు. మళ్లీ బైడెన్ అధికారంలోకి రానుండటంతో అతన్నే పున:నియమించారు. కర్ణాటకకు చెందిన దంపతులకు జన్మించిన వివేక్ మూర్తి బాల్యం మయామీలో గడిచింది.

Tags:    

Similar News