Lahore: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా లాహోర్.. 394కు చేరిన ఏక్యూఐ !

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పాకిస్థాన్‌లోని లాహోర్ నిలిచింది. లాహోర్‌లో గాలి నాణ్యత చాలా దారుణంగా పడిపోయింది.

Update: 2024-10-22 16:42 GMT

దిశ; నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పాకిస్థాన్‌లోని లాహోర్ నిలిచింది. లాహోర్‌లో గాలి నాణ్యత చాలా దారుణంగా పడిపోయింది. ఈ సిటీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఊ) 394కి చేరుకున్నట్టు పలు నివేదికలు తెలిపాయి. దీంతో వారం రోజుల్లోనే లాహోర్ రెండోసారి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారింది. ప్రమాదకరమైన పొగమంచు కారణంగా నగరవాసులు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది సహా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోజు రోజుకూ పెరుగుతున్న కాలుష్యం కారణంగా, పొగమంచు ప్రభావాన్ని తగ్గించేందుకు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం ఇటీవల కృత్రిమ వర్షం కురిపించింది. అయినప్పటికీ కాలుష్యం తగ్గలేదు. పంట అవశేషాలను నిరంతరం కాల్చడం, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ కారణంగా వాయు కాలుష్యం సమస్య పెరుగుతోందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.


Similar News