Bangladesh : బంగ్లాదేశ్‌లో మరోసారి హిందూ సంఘం నేత చిన్మయ్ ప్రభు అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్(Bangladesh)లో హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ గళం వినిపిస్తున్న హిందూ సన్యాసి చిన్మయ్ ప్రభు(Chinmoy Prabhu)ను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్(Bangladesh)లో హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ గళం వినిపిస్తున్న హిందూ సన్యాసి చిన్మయ్ ప్రభు(Chinmoy Prabhu)ను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఆయన ఢాకా(Dhaka) ఎయిర్‌పోర్టు వద్ద ఉండగా.. నగర పోలీసు విభాగానికి చెందిన డిటెక్టివ్ బ్రాంచ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కనీసం కారణం చెప్పకుండానే చిన్మయ్ ప్రభును అదుపులోకి తీసుకున్నారు. హిందువుల ఇళ్లు, దుకాణాలు, ఆలయాలపై దాడులను నిరసిస్తూ నవంబరు 22న బంగ్లాదేశ్‌లోని రంగాపూర్‌లో హిందువులు నిర్వహించిన నిరసన ర్యాలీలో చిన్మయ్ ప్రసంగించారు. ఈ హింసాకాండను ఆపడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
అక్టోబరు 25న హిందువుల భద్రతకు సంబంధించిన 8 డిమాండ్లతో ఛటోగ్రామ్‌లో హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ రోజున ఛటోగ్రామ్‌లోని ఒక ఏరియాలో కొందరు యువకులు జెండా స్తంభంపైకి ఎక్కి.. బంగ్లాదేశ్ జాతీయ పతాకం కంటే ఎక్కువ ఎత్తులో కాషాయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు చిన్మయ్ ప్రభు సహా 18 మంది హిందూ సంఘాల నేతలపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. బంగ్లాదేశ్‌లోని మేఖల్ ప్రాంతంలో ఉన్న పుండరీక్ ధామ్ ఆలయ అధ్యక్షుడిగా చిన్మయ్ ప్రభు ఉన్నారు.