మత్స్యకారులకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాల పంపిణీ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 2017లో చేపల ఉత్పత్తి 1.65 లక్షల టన్నులు ఉండగా ఈ ఏడాది 4.20 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అవుతుందని మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మత్స్యకారులకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహానాలను మంత్రి తలసాని పంపిణీ చేసి మాట్లాడారు. ఇప్పటి వరకు 60శాతం సబ్సిడీతో 130 మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను పంపిణీ చేశామని […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 2017లో చేపల ఉత్పత్తి 1.65 లక్షల టన్నులు ఉండగా ఈ ఏడాది 4.20 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అవుతుందని మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మత్స్యకారులకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహానాలను మంత్రి తలసాని పంపిణీ చేసి మాట్లాడారు.
ఇప్పటి వరకు 60శాతం సబ్సిడీతో 130 మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను పంపిణీ చేశామని ఆయన తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. మత్స్యరంగంలో ఉన్న గంగపుత్రులు, ముదిరాజ్ లు కలిసికట్టుగా ఉన్నప్పుడే ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాలు పాల్గొన్నారు.