సీఐ ప్రవర్తనకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా.. చివరికి
దిశ, జనగామ: పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే జనగామ సీఐ బాలాజీ వరప్రసాద్ పట్టించుకోవడం లేదని బుధవారం రాత్రి జనగామ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఏసీరెడ్డి నగర్ కాలనీ వాసులు జనగామ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఏసీరెడ్డి నగర్ వాసులు మాట్లాడుతూ.. కాలనీలో టీఆర్ఎస్ నేతలు పెత్తనాలు కొనసాగిస్తూ కాలనీవాసుల మధ్యలో గొడవలు సృష్టింస్తున్నారన్నారు. కాలనీలో జరిగిన మహిళల గొడవ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోవడం లేదన్నారు. […]
దిశ, జనగామ: పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే జనగామ సీఐ బాలాజీ వరప్రసాద్ పట్టించుకోవడం లేదని బుధవారం రాత్రి జనగామ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఏసీరెడ్డి నగర్ కాలనీ వాసులు జనగామ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఏసీరెడ్డి నగర్ వాసులు మాట్లాడుతూ.. కాలనీలో టీఆర్ఎస్ నేతలు పెత్తనాలు కొనసాగిస్తూ కాలనీవాసుల మధ్యలో గొడవలు సృష్టింస్తున్నారన్నారు. కాలనీలో జరిగిన మహిళల గొడవ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోవడం లేదన్నారు.
టీఆర్ఎస్ నేతలకు అండగా జనగామ పోలీసులు వ్యవహరిస్తున్నారని, సీఐ బాలాజీ వరప్రసాద్ సామాన్యులకు పోలీస్ సేవలు సక్రమంగా అందించడం లేదని ఆరోపిస్తూ కాలనీలోని మహిళలు, నాయకులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఐ బాలాజీ వరప్రసాద్ వెంటనే వారు ఇచ్చిన ఫిర్యాదును తీసుకొని కేసు నమోదు చేస్తామని బాధితులకు హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.