యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు
దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధి భక్తులతో కిక్కిరిసిపోయింది. కార్తీక మాసం చివరి వారానికి తోడు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు స్వామి వారి దర్శనార్థం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో కొండపైన ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది. దర్శన, లడ్డూప్రసాద క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. దీంతో స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. బాలాలయంలో నిర్వహించిన స్వామివారి నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని […]
దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధి భక్తులతో కిక్కిరిసిపోయింది. కార్తీక మాసం చివరి వారానికి తోడు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు స్వామి వారి దర్శనార్థం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో కొండపైన ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది. దర్శన, లడ్డూప్రసాద క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. దీంతో స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది.
బాలాలయంలో నిర్వహించిన స్వామివారి నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. కార్తీక మాసం కావడంతో సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపారాధన చేయడం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు భక్తుల రద్దీ కారణంగా వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు పోలీసులు.