వన దేవతల దర్శనానికి భక్తజనం క్యూ..
దిశ ప్రతినిధి, వరంగల్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మల సన్నిధికి క్రమంగా భక్తుల తాకిడి పెరుగుతోంది. వన దేవతలకు మొక్కులు చెల్లించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం భారీగా తరలివస్తున్నారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి, సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం(బెల్లం), చీరె, సారె, పసుపు, కుంకుమలను భక్తులు సమర్పిస్తున్నారు. రెండ్లేండ్లకొకసారి ఘనంగా నిర్వహించే ఈ వన జాతర ఆసియాలోనే అతిపెద్దది. 2020 ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా జరిగిన […]
దిశ ప్రతినిధి, వరంగల్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మల సన్నిధికి క్రమంగా భక్తుల తాకిడి పెరుగుతోంది. వన దేవతలకు మొక్కులు చెల్లించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం భారీగా తరలివస్తున్నారు.
జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి, సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం(బెల్లం), చీరె, సారె, పసుపు, కుంకుమలను భక్తులు సమర్పిస్తున్నారు. రెండ్లేండ్లకొకసారి ఘనంగా నిర్వహించే ఈ వన జాతర ఆసియాలోనే అతిపెద్దది. 2020 ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా జరిగిన వనజాతర, ఏడాది విరామం తర్వాత మళ్లీ 2022 ఫిబ్రవరిలో జరగనుంది.