మీ వద్ద ఉన్న లైసెన్స్డ్ వెపన్స్ డిపాజిట్ చేయండి: సీపీ సత్యనారాయణ
దిశ, కరీంనగర్ సిటీ: హుజురాబాద్ బైపోల్స్ జరగనున్న నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేయాలని సీపీ సత్యనారాయణ ఓ ప్రకటనలో కోరారు. ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వెపన్స్ అప్పగించాలన్నారు. జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల వద్ద విధులు నిర్వర్తించే భద్రతా సిబ్బంది, గార్డు డ్యూటీలో పనిచేసే వ్యక్తులు మినహా మిగతా వారంతా సంబంధిత స్టేషన్లలో ఆయుధాలను డిపాజిట్ చేయాలన్నారు. లేనట్టయితే ఆయుధాలను […]
దిశ, కరీంనగర్ సిటీ: హుజురాబాద్ బైపోల్స్ జరగనున్న నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేయాలని సీపీ సత్యనారాయణ ఓ ప్రకటనలో కోరారు. ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వెపన్స్ అప్పగించాలన్నారు. జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల వద్ద విధులు నిర్వర్తించే భద్రతా సిబ్బంది, గార్డు డ్యూటీలో పనిచేసే వ్యక్తులు మినహా మిగతా వారంతా సంబంధిత స్టేషన్లలో ఆయుధాలను డిపాజిట్ చేయాలన్నారు. లేనట్టయితే ఆయుధాలను వారి నుండి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయా స్టేషన్లలో డిపాజిట్ చేసిన లైసెన్స్ హోల్డర్లు నవంబర్ 6న తిరిగి తీసుకోవచ్చని తెలిపారు.