బిగ్ బ్రేకింగ్.. సీఎం కీలక నిర్ణయం.. పెట్రోల్‌పై రూ.8 తగ్గింపు
దిశ, డైనమిక్ బ్యూరో : సామాన్యుడికి భారంగా మారిన పెట్రో ధరలను అదుపు చేసేందుకు కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజలకు మరికొంత ఉపశమనం కలిగించేలా వ్యాట్ తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి. కానీ, తెలుగు రాష్ట్రాలు మాత్రం పెట్రో ధరలు తగ్గింపు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, తాజాగా ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్ తగ్గించేందుకు ముందుకు వచ్చింది. ఏకంగా లీటర్ పెట్రోల్‌పై రూ.8 తగ్గించేందకు […]
దిశ, డైనమిక్ బ్యూరో : సామాన్యుడికి భారంగా మారిన పెట్రో ధరలను అదుపు చేసేందుకు కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజలకు మరికొంత ఉపశమనం కలిగించేలా వ్యాట్ తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి. కానీ, తెలుగు రాష్ట్రాలు మాత్రం పెట్రో ధరలు తగ్గింపు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అయితే, తాజాగా ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్ తగ్గించేందుకు ముందుకు వచ్చింది. ఏకంగా లీటర్ పెట్రోల్‌పై రూ.8 తగ్గించేందకు సిద్ధమైంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97గా ఉంది. ఆప్ సర్కార్ నిర్ణయంతో ఢిల్లీ ప్రజలకు భారీ ఉపశమనం కలగనుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.108.20, లీటర్ డీజిల్ ధర రూ.94.62 గా ఉంది.
#Delhi government has announced reduction of #VAT rate on #petrol to 19.40% from 30%.
With this price reduction, petrol price in the national capital is set to be reduced by ₹8 per litre. Details here.https://t.co/S7VOHrtvuc
— HT Auto (@HTAutotweets) December 1, 2021