ఇంతకీ శవాలు కాలుతున్నాయా..?
దిశప్రతినిధి, కరీంనగర్ : కరోనా మహమ్మారితో పదుల సంఖ్యలో జరుగుతున్న మరణాల తరువాత మృతదేహాలు పూర్తిగా కాలుతున్నాయా లేదా అన్న చర్చ మొదలైంది. కరీంనగర్ నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న మానేరు నది తీరంలో నిత్యం కరోనాతో చనిపోయిన శవాలను దహనం చేస్తున్నారు. అయితే, ఈ శవాలు పూర్తిగా కాలుతున్నాయా లేదా అన్న విషయం దేవుడెరుగు అన్నట్టుగా తయారైంది. నిత్యకృత్యంగా మారిన కరోనా మృతదేహలను దహనం చేస్తున్నారు కాని పూర్తిగా కాలిపోతున్నాయా లేదా అన్న విషయాన్ని పట్టించుకోవడం లేదన్న […]
దిశప్రతినిధి, కరీంనగర్ : కరోనా మహమ్మారితో పదుల సంఖ్యలో జరుగుతున్న మరణాల తరువాత మృతదేహాలు పూర్తిగా కాలుతున్నాయా లేదా అన్న చర్చ మొదలైంది. కరీంనగర్ నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న మానేరు నది తీరంలో నిత్యం కరోనాతో చనిపోయిన శవాలను దహనం చేస్తున్నారు. అయితే, ఈ శవాలు పూర్తిగా కాలుతున్నాయా లేదా అన్న విషయం దేవుడెరుగు అన్నట్టుగా తయారైంది. నిత్యకృత్యంగా మారిన కరోనా మృతదేహలను దహనం చేస్తున్నారు కాని పూర్తిగా కాలిపోతున్నాయా లేదా అన్న విషయాన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసంపూర్తిగా కాలిన కాష్టాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. ఒకవేళ శవాలు పూర్తిగా కాలనట్టయితే చితి చల్లారిన తరువాత మాంసం ముద్దలను కుక్కలు, ఇతర జీవరాశులు పీక్కుని తినే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మాంసం ముద్దలను పక్షులు కూడా తీసుకెళ్తుంటాయి. దీనివల్ల జనవాసాల మధ్య కరోనా శవాల తాలుకు మాసం ముద్దలు వచ్చి చేరే అవకాశం లేకపోలేదు. కరోనా సోకి చనిపోయిన వారిలో కోవిడ్ లక్షణాలు ఉండే అవకాశం లేకపోయినప్పటికీ మృతదేహాలపై బ్యాక్టీరియా వచ్చి చేరినట్టయితే ఆ మాంసం తిన్న జంతువులు, పక్షులు వ్యాధుల బారిన ప్రమాదం ఉంటుంది. అవి జనావాసాల్లోకి తిరడం, శవాల మాంసం ముక్కలను జనావాసాల్లో పడేసినప్పుడు ఇన్ ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
బాధ్యులెవరూ.?
కరోనాతో చనిపోయిన మృతదేహాలను దహనం చేసే ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాల్సింది ఎవరూ అన్నది అంతుచిక్కకుండా తయారైంది. బల్దియా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మరణించిన వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆసుపత్రులు బల్దియాకు పంపిస్తున్నందున దహనం చేసేందుకు కాంట్రాక్టు తీసుకుంటున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే మరణాల సంఖ్య మరింత పెరిగితే శ్మశాన వాటికల సమీపాల్లో నివసించే జనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.