హుజురాబాద్‌కు సీఎం కేసీఆర్ మరో గుడ్ న్యూస్
దిశ, తెలంగాణ బ్యూరో: దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ. 2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్లతో పాటు ఇప్పుడు విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి […]
దిశ, తెలంగాణ బ్యూరో: దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ. 2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్లతో పాటు ఇప్పుడు విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుకు మొత్తం రూ. 1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా.. వారం రోజుల్లోపు మరో రూ.1000 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నది. దాంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి.
ఇవి కూడా చదవండి:
ప్రగతిభవన్ సాక్షిగా ‘పవర్’ వార్.. కేటీఆర్, కవిత మధ్య క్లాష్.!