అతివ కోసం ఆశపడ్డ డాక్టర్.. చివరకు..

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. తాజాగా డేటింగ్ యాప్ పేరుతో ఓ డాక్టర్‌ను మోసం చేశారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళితే.. పద్మానగర్‌కు చెందిన ఓ వైద్యుడు(57) అమ్మాయిలో చాటింగ్ చేయాలన్న కోరికతో డేటింగ్ సైట్లు చూడటం మొదలెట్టాడు. మూడు నెలల క్రితం ఓ నెంబర్‌కు కాల్ చేయగా, అమ్మాయిలా ఒకతను చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఫీజుల పేరిట నెలల్లో రూ.41.5 లక్షలు కాజేసాడు. ఈ క్రమంలో […]

Update: 2020-10-10 00:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. తాజాగా డేటింగ్ యాప్ పేరుతో ఓ డాక్టర్‌ను మోసం చేశారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళితే.. పద్మానగర్‌కు చెందిన ఓ వైద్యుడు(57) అమ్మాయిలో చాటింగ్ చేయాలన్న కోరికతో డేటింగ్ సైట్లు చూడటం మొదలెట్టాడు. మూడు నెలల క్రితం ఓ నెంబర్‌కు కాల్ చేయగా, అమ్మాయిలా ఒకతను చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఫీజుల పేరిట నెలల్లో రూ.41.5 లక్షలు కాజేసాడు. ఈ క్రమంలో ఆ డాక్టర్ అప్పులు చేయడం ప్రారంభించాడు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు డాక్టర్‌ను నిలదీయగా, విషయం చెప్పాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కేసులు నమోదు చేసుకుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News