కారు చీకట్లో పాత రుద్రారం

దిశ, కాటారం: భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని రుద్రారం గ్రామపంచాయితి పరిధిలోని పాత రుద్రారం గ్రామప్రజలు గత వారం రోజులుగా కారు చీకట్లో మగ్గుతున్నారు. దీంతో ప్రజలు సాయంత్రం కాగానే భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజులుగా వీధి లైట్లు వెలగక పోవడంతో గ్రామానికి చుట్టూ పక్కల పంట పొలాలు, అడవి ఉండటంతో రాత్రి వేళల్లో విష పురుగులు, అటవీ జంతువులతో ఎప్పుడు ఏం జరుగుతుందోఅని భయబ్రాంతులకు గురవుతున్నారు. విద్యుత్ మరమ్మతులు చేపట్టాలని స్థానిక వార్డు సభ్యుడు సదానందంతోపాటు […]

Update: 2021-04-21 08:18 GMT

దిశ, కాటారం: భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని రుద్రారం గ్రామపంచాయితి పరిధిలోని పాత రుద్రారం గ్రామప్రజలు గత వారం రోజులుగా కారు చీకట్లో మగ్గుతున్నారు. దీంతో ప్రజలు సాయంత్రం కాగానే భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజులుగా వీధి లైట్లు వెలగక పోవడంతో గ్రామానికి చుట్టూ పక్కల పంట పొలాలు, అడవి ఉండటంతో రాత్రి వేళల్లో విష పురుగులు, అటవీ జంతువులతో ఎప్పుడు ఏం జరుగుతుందోఅని భయబ్రాంతులకు గురవుతున్నారు. విద్యుత్ మరమ్మతులు చేపట్టాలని స్థానిక వార్డు సభ్యుడు సదానందంతోపాటు ప్రజలు స్థానిక విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వారు పెడచెవిన పెట్టడమేకాక మాకు సంబంధం లేదంటూ.. మీరు గ్రామపంచాయతీ లో ఎలక్ట్రిషన్ ను నియమించుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని అన్నారు. సబంధంలేని విద్యుత్ అధికారులు గ్రామపంచాయతీ నుంచి నెలనెలా లక్షల విద్యుత్ బిల్లులు ఎందుకు వసూల్ చేస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైన మండల విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కరెంట్ మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News