మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ విందు..

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ విందు పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని గంగాధర సబ్ రిజిస్టర్ నూర్ఖాన్ అన్నారు.

Update: 2025-03-19 15:34 GMT
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ విందు..
  • whatsapp icon

దిశ, గంగాధర : మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ విందు పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని గంగాధర సబ్ రిజిస్టర్ నూర్ఖాన్ అన్నారు. బుధవారం నాడు మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర రంజాన్‌ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. సర్వమత సారం ఒక్కటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.


Similar News