పెంపుడు కుక్క దొంగతనం.. బాలుడి కిడ్నాప్ కి యత్నం..

తమ పెంపుడు కుక్కని దొంగిలించాడు అనే అనుమానంతో బాలుడిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించి నలుగురు వ్యక్తులు పోలీసులకి చిక్కిన ఘటన సంచలనం సృష్టించింది.

Update: 2025-03-19 15:27 GMT
పెంపుడు కుక్క దొంగతనం.. బాలుడి కిడ్నాప్ కి యత్నం..
  • whatsapp icon

దిశ, పెగడపల్లి : తమ పెంపుడు కుక్కని దొంగిలించాడు అనే అనుమానంతో బాలుడిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించి నలుగురు వ్యక్తులు పోలీసులకి చిక్కిన ఘటన సంచలనం సృష్టించింది. ఎస్సై రవి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నందగిరి గ్రామానికి చెందిన ఐలవెని రంజిత్ కుమార్ (16)మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నాడు. రోజులానే తన పాఠశాలను ముగించుకుని తన స్నేహితుడైన శివరాత్రి శివతో బైక్ పైన తమ గ్రామానికి వెళ్తుండగా గ్రామ శివారులో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్దనున్న బ్రిడ్జి వద్దకు రాగానే కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లికి చెందిన నవీన్ కుమార్, అరేపల్లి అనిల్, గసిగంటి వర్ధన్, మైస అజయ్ అనే నలుగురు వ్యక్తులు కారులో వచ్చి నవీన్ కి సంబంధించిన పెంపుడు కుక్కని రంజిత్ దొంగిలించాడు. అనే అనుమానంతో బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్తుండగా రంజిత్ స్నేహితుడైన శివ ఆ విషయాన్ని పాఠశాల సిబ్బందికి, రంజిత్ బంధువులకు తెలుపగా వారి ఫిర్యాదు మేరకు ఎస్సై రవి కిరణ్ తన సిబ్బంది వెంకట్ రెడ్డి, రవీందర్, శ్రీనివాస్ లతో గంటల వ్యవధిలో కారును పట్టుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేసినట్లు తెలిపారు.


Similar News