చెన్నై పిచ్ క్యూరేటర్‌ను తొలగించిన బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్ : చెన్నైలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం అనంతరం ఆ పిచ్ తయారు చేసిన క్యూరేటర్‌ను బీసీసీఐ తొలగించింది. అదే వేదికగా శనివారం నుంచి ఇండియా-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరుగనున్నది. అయితే టీమ్ ఇండియా క్రికెటర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు రెండో టెస్టుకోసం తయారు చేస్తున్న పిచ్ కోసం వేరే క్యూరేటర్‌ను నియమించింది. టీమ్ మేనేజ్‌మెంట్, స్థానిక చీఫ్ గ్రౌండ్స్‌మాన్ వి.రమేష్ కుమార్ కలసి పిచ్ తయారీలో […]
దిశ, స్పోర్ట్స్ : చెన్నైలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం అనంతరం ఆ పిచ్ తయారు చేసిన క్యూరేటర్‌ను బీసీసీఐ తొలగించింది. అదే వేదికగా శనివారం నుంచి ఇండియా-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరుగనున్నది. అయితే టీమ్ ఇండియా క్రికెటర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు రెండో టెస్టుకోసం తయారు చేస్తున్న పిచ్ కోసం వేరే క్యూరేటర్‌ను నియమించింది. టీమ్ మేనేజ్‌మెంట్, స్థానిక చీఫ్ గ్రౌండ్స్‌మాన్ వి.రమేష్ కుమార్ కలసి పిచ్ తయారీలో సూచనలు ఇస్తున్నారు.
తొలి టెస్టు పిచ్‌ను సెంట్రల్ జోన్‌కు చెందిన క్యూరేటర్ తపోష్ చటర్జీ పర్యవేక్షణలో తయారు చేశారు. అయితే అతడిని టెస్టు బాధ్యతల నుంచి తప్పించి ఇండోర్, జైపూర్ స్టేడియంలలో జరుగనున్న విజయ్ హజారే ట్రోఫీ కోసం పిచ్‌ల తయారీ పనికి నియమించింది. తొలి టెస్టు సమయంలో చివరి రెండు రోజులు పిచ్ అధ్వానంగా తయారైంది. ఇషాంత్ శర్మ అయితే పిచ్‌ను మట్టి రోడ్డుగా అభివర్ణించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పిచ్ స్వభావంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో పిచ్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ సూచనల మేరకు తయారు చేస్తున్నారు. మిగిలిన మూడు టెస్టుల్లో ఒక్కటి ఓడినా భారత జట్టు ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో స్పిన్నర్లకు అనుకూలించేలా పిచ్‌ను తయారు చేస్తున్నారు.