బ్మాడ్మింటన్ కోర్టులో విషాదం.. కన్నుమూసిన సీఆర్పీఎఫ్ జవాన్

దిశ, కాటారం : ప్రమాదవశాత్తు సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో ఆదివారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మహాముత్తారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న బ్యాడ్మింటన్ కోర్టులో లైట్లు అమర్చే క్రమంలో 58వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన జవాన్ హర్యానా వాసి పవన్ సింగ్ (38) ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురయ్యాడు. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది హుటాహుటిన భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో […]

Update: 2021-08-08 08:41 GMT

దిశ, కాటారం : ప్రమాదవశాత్తు సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో ఆదివారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మహాముత్తారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న బ్యాడ్మింటన్ కోర్టులో లైట్లు అమర్చే క్రమంలో 58వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన జవాన్ హర్యానా వాసి పవన్ సింగ్ (38) ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురయ్యాడు.

వెంటనే స్పందించిన తోటి సిబ్బంది హుటాహుటిన భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. స్థానిక ఎస్ఐ సీహెచ్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News