నీ పిల్లలను నువ్వు తీసుకుపో.. నా బ్రతుకు నేను బతుకుతా
నీ పిల్లలను నువ్వు తీసుకుపో.. నా బ్రతుకు నేను బతుకుతా అంటూ మాజీ భర్తకు ఫోన్ చేసి ఓ ఇల్లాలు అదృశ్యమయిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
దిశ, బడంగ్పేట్ : నీ పిల్లలను నువ్వు తీసుకుపో.. నా బ్రతుకు నేను బతుకుతా అంటూ మాజీ భర్తకు ఫోన్ చేసి ఓ ఇల్లాలు అదృశ్యమయిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పహాడిషరీఫ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎండీ రిజ్వానా బేగం కూతురు ఆఫ్రిన్ బేగంతో పదేళ్ళ క్రితం అయూబ్ గులామ్తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు తలెత్తడంతో సంవత్సరం క్రితం పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు.
పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తున్న ఆఫ్రిన్ బేగంకు పిల్లల సంరక్షణార్థం అయూబ్ గులామ్ భరణం చెల్లిస్తున్నాడు. ఈ నెల 15వ తేదీన ఆఫ్రిన్బేగం మాజీ భర్త అయూబ్ గులామ్కు ఫోన్ చేసి నీ పిల్లలను నువ్వు తీసుకుపో.. నా బ్రతుకు నేను బతుకుతా అంటూ ఫోన్ చేసి అదృశ్యమయ్యింది. అయూబ్ గులామ్ ద్వారా సమాచారం అందుకున్న తల్లి రిజ్వాన్ బేగం పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.