Breaking: రూ.300 కోట్లు కొట్టేసిన కేటుగాడు అరెస్ట్
హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో భారీ స్కామ్ జరిగింది.
దిశ, వెబ్ డెస్క్: కొంతమంది ప్రైవేటు ఉద్యోగుల అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. జీతాలు పెంచుకునేలా పని చేయకుండా పాడు పనులు చేస్తున్నారు. ఈజీ డబ్బు కోసం జనాల నెత్తిన చేయి పెడుతున్నారు. పని చేసిన సంస్థలకు చెడ్డ పేరు తెస్తున్నారు. ఇలాంటి ఘటన హైదరాబాద్ సైబరాబాద్(Hyderabad Cyberabad) పరిధిలో జరిగింది.బై బ్యాక్ పాలసీ స్కీమ్(Buy back policy scheme), డబుల్ గోల్డ్ స్కీమ్(Double Gold Scheme) పేరుతో ప్రైవేటు సంస్థలో పని చేసే పవన్, అతని సహచరులు భారీ మోసానికి పాల్పడ్డారు. పవన్, అతని ఫ్రెండ్స్ చెప్పిన మాటలు ఈ రెండు స్కీముల్లో దాదాపు 3600 మందికి పైగా రూ. 300 కోట్లు డిపాజిట్లు కట్టారు. తీరా భారీ మొత్తంలో మోసపోయి ఇప్పుడు లబోదిబోమంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు నిందితుడు పవన్ను అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన ఏడుగురిని కూడా కటకటాల్లోకి పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.