Chamala: ఇది కూడా చెప్పుకుంటే కాళోజీ ఆత్మ ఘోషిస్తది.. బీఆర్ఎస్‌పై చామల కిరణ్ ఫైర్

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్(Pragathi Bhavan), కాళేశ్వరం(Kaleswaram) పూర్తయ్యాయి.. కానీ కాళోజీ కళాక్షేత్రం మాత్రం మొండి గోడలతో ఆగిపోయిందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ(Bhuvanagiri Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు.

Update: 2024-11-15 12:55 GMT

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్(Pragathi Bhavan), కాళేశ్వరం(Kaleswaram) పూర్తయ్యాయి.. కానీ కాళోజీ కళాక్షేత్రం మాత్రం మొండి గోడలతో ఆగిపోయిందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ(Bhuvanagiri Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు. వరంగల్ లో పూర్తయిన కాళోజీ కళాక్షేత్రం భవనం ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. దీనిపై అధికారంలోకి వచ్చీ రాగానే.. విలాసవంతమైన ప్రగతి భవన్ పూర్తయ్యిందని, ఫాంహౌస్(Farmhouse) కొత్త రూపు సంతరించుకుందని అన్నారు. అలాగే కమీషన్ల కాళేశ్వరం పూర్తవ్వడమే గాక కూలిపోయింది(Collapsed) కూడా.. అని వ్యాఖ్యానించారు.

అంతేగాక జన్వాడ(Janwada)లో ఫాంహౌస్ వచ్చిందని, కుమార్తె కు విలాసవంతమైన రాజభవన్ వచ్చిందని ఆరోపించారు. ఇక 2014 సెప్టెంబర్ 9న కేసీఆర్(KCRBRS) స్వయంగా భూమిపూజ చేసిన వరంగల్(Warangal) లోని కాళోజీ కళాక్షేత్రం(Kaloji Kalakshetra) మాత్రం ఆయన దిగిపోయే వరకు మొండి గోడలతోనే ఉందని విమర్శించారు. రూ.50 కోట్లతో ఆ నాడే పూర్తి కావాల్సిన కళాక్షేత్రాన్ని, రూ.95 కోట్లకు అంచనాలు పెరిగే వరకు పూర్తి చేయకుండా వదిలేశారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పది నెలల్లోనే రూ.45 కోట్లు విడుదల చేసి కాళోజి కళాక్షేత్రాన్ని చిత్తశుద్దితో పూర్తి చేయించారని చెప్పారు. ఇక ఇది కూడా మేమే కట్టామని మీరు చెప్పుకుంటే, కాళోజీ ఆత్మ ఘోషిస్తుందని చామల వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News