గుప్పుమంటున్న గంజాయి.. కళాశాల విద్యార్థులే టార్గెట్

కళాశాల విద్యార్థులే టార్గెట్ గా గంజాయి వ్యాపారులు చెలరేగిపోతున్నారు.

Update: 2024-11-15 08:30 GMT

దిశ, హుజురాబాద్ : కళాశాల విద్యార్థులే టార్గెట్ గా గంజాయి వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ముందుగా ఒకరిద్దరికి అలవాటు చేసి వారి ద్వారా తమ చైన్ ను పెంచుకునేందుకు వీరు ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నట్లు సమాచారం.తాజా గా హుజురాబాద్ పక్కన గల ఎల్కతుర్తి సమీపంలోగల ఎస్ ఆర్ కళాశాల లో నీ వసతిగృహం లో శుక్రవారం ఐదుగురు విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా పట్టుకుని హాసన్ పర్తి పోలీసులకు అప్పగించారు. తాజాగా జరిగిన ఈ సంఘటన కాకుండా అంతకుముందు సైతం గంజాయి అమ్ముతుండగా పోలీసులకు చిక్కిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

హుజురాబాద్ సబ్ డివిజన్ లో సైతం అనేక గంజాయి కేసులు నమోదు అయ్యాయి. వీటన్నింటిపై జరిపిన పరిశోధనలో గంజాయి భద్రాచలం నుంచి వరంగల్,కరీంనగర్ జిల్లాలకు దొంగచాటుగా సరఫరా చేస్తున్నట్లు సమాచారం.కొంత మంది ముఠాగా మారి కళాశాల విద్యార్థులే టార్గెట్ చేసుకొని గంజాయి వ్యాపారాన్ని పెంచి పోషిస్తున్నట్లు సమాచారం.ముందుగా ఒకరిద్దరు విద్యార్థుల ను పరిచయం పెంచుకుని వారు ద్వారా తమ వ్యాపారాన్ని కళాశాల లోపలికి తీసుకెళ్ళి నడుపుతున్నట్లు తెలిసింది.హనుమకొండ లోని ఇంజనీరింగ్ కళాశాల లను టార్గెట్ గా చేసుకున్న ఈ గాంజా గ్యాంగ్ చుట్టుపక్కల పట్టణాలకు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ట్లు సమాచారం.ఇటీవల హుజురాబాద్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి నీ హనుమకొండ జిల్లా వెలేర్ పోలీసులు అదుపులోకి తీసుకొని గాంజా గ్యాంగ్ లో సభ్యుడుగా గుర్తించారు. సైకిల్ సైతం లేని వ్యక్తులు కారులో తిరగడంతో వీరి వ్యాపారం పై మక్కువ పెంచుకున్న మరికొందరు వీరి ముఠా లో సభ్యులుగా చేరడంతో వీరి కార్య క్రమాలు దినదినం విస్తరిస్తూ పట్టణాలు కాకుండా పల్లెలకు సైతం విస్తరిస్తున్నాయి.

పట్టణాల్లో పోలీస్ నిఘా ఎక్కువవుతున్న దశలో ప్రస్తుతం గాంజా బ్యాచ్ పల్లెలకు విస్తరిస్తూ యువకులే లక్ష్యంగా పని చేస్తున్నారు.గ్రామాల్లో ఇక్కడ చూసిన గుంపులు,గుంపులుగా యువకులు సాయంత్రం అయ్యిందంటే మీటింగ్ లు పెట్టుకొని గాంజా పీల్చు తున్నట్లు సమాచారం అందుతోంది.వీరు సిగరెట్లు పీల్చుతూ అందులో గాంజా ను కలుపు కుంటున్నట్లు తెలుపుతున్నారు. దీంతో గ్రామాల్లో నేరాల సంఖ్య పెరుగుతున్నట్లు భావిస్తున్నారు . పల్లెలు,పట్టణాల్లో యువకులే లక్ష్యంగా పనిచేస్తున్న గాంజా బ్యాచ్ ను కనుగొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Similar News