మాజీ సర్పంచ్ భర్త పై అట్రాసిటీ కేసు నమోదు..
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి చెందిన
దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి చెందిన సున్నం సత్యం పై అట్రాసిటీ కేసు నమోదు అయినట్లు మెట్ పల్లి డీఎస్పీ ఏ.రాములు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... వేముల కుర్తి గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళపై మాజీ సర్పంచ్ భర్త సున్నం సత్యం అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తన ఇంటిపై దాడి చేశాడని లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెట్ పల్లి డీఎస్పీ రాములు కేసు నమోదు చేశాడు. గురువారం వేముల కుర్తి గ్రామంలో విచారణ చేపట్టి సున్నం సత్యం పై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.ప్రస్తుతం లక్ష్మికి గాయాలు అవడంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.