Elephant figurines : నాలుగు ఏనుగు బొమ్మల విలువ 1.75 కోట్లు..!
ఓ నాలుగు చిట్టి ఏనుగుల బొమ్మల (Elephant figurines)విలువ 1.75కోట్లు పై మాటే. నమ్మశక్యంగా లేకున్న అది నిజం.
దిశ, వెబ్ డెస్క్ : ఓ నాలుగు చిట్టి ఏనుగుల బొమ్మల (Elephant figurines)విలువ 1.75కోట్లు పై మాటే. నమ్మశక్యంగా లేకున్న అది నిజం. అంటే అది ఏ బంగారతంతోనే, వజ్రాలతోనో లేక పంచలోహాలతోనో చేసినవేమి కాదు. మరి అంత విలువ ఎందుకన్న సందేహం తలెత్తక మానదు. పిల్లలు ఆడుకునే బొమ్మల సైజులో ఉన్న ఆ నాలుగు ఏనుగు బొమ్మలను ఏకంగా ఏనుగు దంతాలతోనే తయారు చేశారు. మరి అందుకే వాటికి అంత విలువ మరి. ఏనుగు దంతాలతో తయారు చేసిన నాలుగు స్మగ్లింగ్ ఏనుగు బొమ్మల( Smuggling Elephant figurines)ను చెన్నై విల్లుపురం(Chennai)అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏనుగు దంతాలతో అద్భుత కళా నైపుణ్యం ప్రదర్శించి మలిచిన ఆ ఏనుగు బొమ్మలు అటవీ శాఖ అధికారులకు చిక్కాయి. ఈ నాలుగు ఏనుగు బొమ్మల విలువ సుమారు 1.75 కోట్లుకు పైగానే అని వారు తేల్చారు.
విల్లుపురం కొత్త బస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఒప్పందం కుదుర్చుకుని స్మగ్లర్లు వాటిని విక్రయించినట్లుగా సమాచారం. ఈ ఏనుగు దంతాల బొమ్మల అక్రమ వ్యాపారం వ్యవహారం తేల్చే పనిలో అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో చెన్నై, తిరుచ్చి, తంజావూరు, దిండిగల్, ధర్మపురి జిల్లాలకు చెందిన 12 మంది స్మగ్లర్లు అరెస్టు అయినట్లు అధికారులు తెలిపారు. గత కొంత కాలంగా పెద్ద సంఖ్యలో ఎనుగు దంతాల బొమ్మలను పెద్ద ఎత్తున సంపన్న కుటుంబాలకు తిరుచ్చికి చెందిన ముఠా విక్రయిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఈ ముఠా ఏనుగులను చంపి వాటి దంతాలతో బొమ్మలను చేసి విక్రయిస్తోందని, ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న కీలక నిందితులను గుర్తించేందుకు విచారణ ముమ్మరం చేశారు.