ఫిలిప్పీన్స్‌లో సంగారెడ్డి మెడికో అనుమానాస్పద మృతి
పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ.. ఫిలిప్పీన్స్ లో మెడిసిన్ చదువుతోంది. స్నిగ్ధ పుట్టినరోజు సందర్భంగా అర్థరాత్రి విష్ చేసేందుకు ఫ్రెండ్స్ ఆమె గదికి వెళ్లారు.
దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డికి చెందిన వైద్య విద్యార్థిని ఫిలిప్పీన్స్ లో అనుమానాస్పద రీతిలో మరణించింది. పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ.. ఫిలిప్పీన్స్ లో మెడిసిన్ చదువుతోంది. స్నిగ్ధ పుట్టినరోజు సందర్భంగా అర్థరాత్రి విష్ చేసేందుకు ఫ్రెండ్స్ ఆమె గదికి వెళ్లారు. స్నిగ్ధను చూసి వారంతా షాకయ్యారు. స్నిగ్ధ మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి అమృత్ రావు విద్యుత్ శాఖలో డీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా.. స్నిగ్ధ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఫిలిప్పీన్స్ దేశ అధికారులతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.