పండుగ పూట విషాదం.. యువకుడిని బలితీసుకున్న రోడ్డు ప్రమాదం
పట్టణంలో హోలీ పండుగ వేళ విషాదం నెలకొంది. పదవతరగతి చదువుతున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.

దిశ, ఆదిలాబాద్ : పట్టణంలో హోలీ పండుగ వేళ విషాదం నెలకొంది. పదవతరగతి చదువుతున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. హోలీ వేడుకలు జరుపుకొని ఇంటికి వెళ్తున్న కొత్తకుమ్మరివాడకు చెందిన జిల్లెడే రిషి కుమార్(16), స్నేహితుడు కేఆర్కే కాలనీకి చెందిన ఆమ్లే ప్రేమ్ కుమార్ ఎరోడ్రం గ్రౌండ్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు.
ఈ ప్రమాదంలో రిషి కుమార్ స్పాట్ లోనే చనిపోగా అతడి స్నేహితుడు ప్రేమ్ కుమార్ ను చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు రిమ్స్ ఆస్పత్రికి చేరుకుని మృతుడిని, గాయపడిన యువకుడిని పరిశీలించారు. తీవ్ర గాయాల పాలైన యువకుడికి వైద్యులు చికిత్స అందించి అత్యవసర విభాగానికి తరలించారు. మృతి చెందిన యువకుడి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.