రాష్ట్రంలో మరో పరువు హత్య.. కానిస్టేబుల్‌ను దారికాచి చంపిన వైనం..

మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో సొంత అక్కనే కడతేర్చాడు కసాయి తమ్ముడు.

Update: 2024-12-02 04:30 GMT

దిశ, వెబ్‌డెస్క్/ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో సొంత అక్కను తమ్ముడే నరికి చంపాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొంగర మాసయ్య కూతురు నాగమణి (28) హయత్‌నగర్ పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే, గత 15 రోజుల క్రితం నాగమణి ఓ అబ్బాయి ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది.

ఊళ్లో తమ పరువు తీసిందంటూ కక్ష పెంచుకున్న తమ్ముడు పరమేష్ అక్కను అంతమొందించేందుకు పక్కా ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే రోజులాగే విధులకు హాజరయ్యేందుకు స్టేషన్‌కు స్కూటీ‌పై వెళ్తున్న నాగమణిని రాయపోలు-మన్నెగూడ సమీపంలో దారికాచి తమ్ముడు కారుతో బలంగా ఢీ కొట్టాడు. అనంతరం కింద పడిపోయిన అక్కను దారుణంగా నరికి చంపిన పరమేష్ నేరుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. నామమణి హత్యతో రాయపోలు గ్రామస్తులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.


Similar News