అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శివంపేట మండలంలోని పోతులబోగుడ గ్రామంలో జరిగింది. మృతుని భార్య మంద పుష్ప తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Update: 2024-12-02 09:38 GMT

దిశ, శివంపేట : అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శివంపేట మండలంలోని పోతులబోగుడ గ్రామంలో జరిగింది. మృతుని భార్య మంద పుష్ప తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంద నాగులు (32) గత సంవత్సరం ఇల్లు కట్టుకోవడంతో అప్పులు అయ్యాయి. వాటిని తీర్చలేక ఊరి పక్కన మోతుకు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని ఇల్లు కట్టుకోవడంతోనే అప్పులు అయ్యాయని తెలిపారు. పుష్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని శివంపేట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.


Similar News