నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. రిపోర్టులో ఏమున్నదంటే..?
ఆదివారం తెల్లవారుజామున కన్నడ సీరియల్ యాక్టర్ శోభిత హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొంది.
దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం తెల్లవారుజామున కన్నడ సీరియల్ యాక్టర్ శోభిత హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటనతో కన్నడ సీరియల్ ఇండస్ట్రీతో పాటు ఆమె కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోయినప్పటికీ ఆదివారం రాత్రి సమయంలో ఆమె రాసిన సూసైడ్ నోట్ (Suicide Note)దొరికింది. సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అది ఎవరిని ఉద్దేశించి రాసిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు.. రిపోర్టును తయారు చేసి పోలీసులకు అప్పగించారు.
అలాగే శోభిత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. దీంతో వెంటనే మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కర్ణాటక తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే.. వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో శోభితది.. ఆత్మహత్యగా స్పష్టం చేశారు. అలాగే ఆమె శరీరంపై ఎటువంటి అనుమానస్పద ఆనవాల్లు, ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు నిర్ధారించారు. కాగా నటి రూమ్ లో దోరికిన సూసైడ్ నోట్‌లో "సూసైడ్ చేసుకోవాలంటే యూ కెన్ డూ ఇట్" అని రాసి ఉంది. కాగా ఈ వ్యాఖ్యల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read...