Srikanth: ‘గేమ్ ఛేంజర్‌’లో నన్ను ఓ కొత్త అవతారంలో చూస్తారు.. ప్రముఖ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’.

Update: 2024-12-02 10:29 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్ర ఖని, ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో శ్రీకాంత్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ గేమ్ ఛేంజర్ మూవీలో తన పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను ఇంత పవర్‌ఫుల్ పాత్రలో చూసి ప్రేక్షకులు కచ్చితంగా షాక్ అవుతారు. డైరెక్టర్ శంకర్ నన్ను పూర్తిగా కొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేశాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా రోల్ గురించి మీరందరూ చర్చించుకుంటారు. ఇక ఈ రోల్ భవిష్యత్తులో నన్ను అనేక అవకాశాలు రావడానికి ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను’ అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News