నాగచైతన్య ‘NC-24’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఈ కాంబో అస్సలు సెట్ కాదంటున్న నెటిజన్లు

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ఇటీవల ‘తండేల్’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

Update: 2025-04-09 10:16 GMT
నాగచైతన్య ‘NC-24’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఈ కాంబో అస్సలు సెట్ కాదంటున్న నెటిజన్లు
  • whatsapp icon

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ఇటీవల ‘తండేల్’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఇదే ఫామ్‌తో నాగచైతన్య వరుస ప్రాజెక్ట్స్ ఒకే చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చైతు, కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ‘NC-24’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

తాజాగా, ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఏప్రిల్ 14నుంచి మొదలు కాబోతున్నట్లు సమాచారం. దీని కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ స్పెషల్ సెట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు టాక్. ఇందుకోసం చర్చలు జరగ్గా.. నటించేందుకు ఆమె గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అన్నపూర్ణ స్టూడియోలో 15 రోజులు జరగనున్న షూట్‌లో ఆమె కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఈ కాంబో అస్సలు ఊహించలేదని అసలు వీరిద్దరి సెట్ కాదని అంటున్నారు.

Tags:    

Similar News