‘క్రిష్-4’లో హృతిక్ రోషన్‌తో జతకట్టబోతున్నమహేష్ బాబు హీరోయిన్.. అంచనాలను పెంచుతున్న ట్వీట్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన ‘క్రిష్’ ఘన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తీసుకువచ్చారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన ‘క్రిష్’ ఘన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తీసుకువచ్చారు. అది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో 2013లో ‘క్రిష్-3’ చిత్రాన్ని విడుదల చేశారు. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ‘క్రిష్-4’ (Krish-4)హృతిక్ స్వయం దర్శకత్వంలో రాబోతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. హృతిక్‌తో పాటు ఆదిత్యచోప్రా దీనిని తెరకెక్కించనున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైనప్పటి నుంచి ‘క్రిష్-4’కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు నటించబోతున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘క్రిష్-4’ హృతిక్ రోషన్ సరసన ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రీతి జింటా(Preity Zinta), వివేక్ ఒబెరాయ్, రేఖ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. కాగా, ప్రియాంక చోప్రా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘SSMB-29’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Hrithik Roshan is set to direct and star in Krrish 4, taking on triple roles, with Priyanka Chopra Jonas likely to reprise her role, while Preity Zinta is reportedly unlikely to return. pic.twitter.com/mEkkfxGDXO
— Social Ketchup Binge (@KetchupBinge) April 9, 2025