Rakul Preet Singh: ఆ నొప్పిని భరిస్తూనే గడిపాను.. బెడ్‌కే పరిమితమయ్యానంటూ రకుల్ షాకింగ్ కామెంట్స్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్(Rakul Preet Singh) ఈ ఏడాది ‘ఇండియన్-2’(Indian-2) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2024-12-02 09:44 GMT
Rakul Preet Singh: ఆ నొప్పిని భరిస్తూనే గడిపాను.. బెడ్‌కే పరిమితమయ్యానంటూ రకుల్ షాకింగ్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్(Rakul Preet Singh) ఈ ఏడాది ‘ఇండియన్-2’(Indian-2) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా హిట్ సాధించలేకపోయింది. అయితే ఈ అమ్మడు ఇటీవల వర్కౌట్(Workout) చేస్తూ గాయపడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా(Social Media) ద్వారా తెలుపుతూ పోస్ట్ పెట్టింది. ఆమె వెన్నెముకకు గాయమైందని చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, రకుల్ తన ఆరోగ్య పరిస్థితి గురించి అప్డేట్ ఇచ్చింది. ‘‘నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. కానీ పూర్తిగా కోలుకోలేదు. అసలు ఏం జరిగిందంటే.. అక్టోబర్ 5న 80 కిలోల బరువు ఎత్తాను. అప్పుడే నా వెన్నెముక(Spine)లో నొప్పి వచ్చింది.

కానీ దాన్ని నేను పట్టించుకోకుండా వర్కౌట్(Workout) చేశాను. అదే నా పాలిట శాపం అయింది. వర్కవుట్ చేయగానే షూటింగ్‌(Shooting)కు వెళ్లా. సాయంత్రం అయ్యేసరికి విపరీతమైన వెన్నునొప్పి వచ్చింది. కొంచెం కూడా బెండ్ అవలేకపోయాను. అయినప్పటికీ అదే తగ్గుతుందని ఆ నొప్పి భరిస్తూనే ఐదు రోజులు గడిపా. నొప్పిని తట్టుకోలేకపోయాను. బీపీ పడిపోయింది. పదిరోజులు ఆస్పత్రి బెడ్‌పై గడిపా. ఈ సమయంలోనే నా బర్త్ డే రావడంతో జాకీ భగ్నానీ(Jackky Bhagnani ) పార్టీ ప్లాన్ చేశాడు. కానీ నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు తను నన్ను ఎంతగానో అర్ధం చేసుకున్నాడు. మంచానికి పరిమితమవడంతో భాదేసింది’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ రకుల్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News

Sai Ramya Pasupuleti