MOKSHAGNA: ఫస్ట్ మూవీ స్టార్ట్ కాకుండానే హిట్ డైరెక్టర్ సినిమాకు ఓకే చేసిన నందమూరి తనయుడు.. (పోస్ట్)
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉండనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తవ్వగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లనుందని తెలుస్తుంది. డిసెంబర్ 5న మోక్షజ్ఞ మొదటి సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ స్టార్ట్ అవ్వకుండానే రెండో సినిమాకు సైన్ చేశాడని తెలుస్తోంది. ఇటీవలే ‘లక్కీ భాస్కర్’ సినిమాతో భారీ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో మూవీ ఉంటుందనే విషయాన్ని తెలుపుతూ మోక్షజ్ఞ ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. అయితే ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక మరో హిట్ డైరెక్టర్‌తో మోక్షజ్ఞ సినిమా తీయబోతున్నాడని తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.