నాకు ఏమీ తెలియదు, గుర్తు లేదు, అన్నీ మర్చిపోయా: ఆర్జీవీ

గత కొన్ని రోజులుగా టావీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)పై కేసుల వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-12-02 12:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా టావీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)పై కేసుల వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేస్తారనే వార్తలు రాగా.. కోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరాడు. కాగా ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 9 వరకు ఆర్జీవీని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కాగా ఆ ఆదేశాల అనంతరం సోమవారం మధ్యాహ్నం ఆర్జీవీ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ తనపై పెట్టిన కేసులపై మాట్లాడుతూ.. తాను రోజుకి 10 నుంచి 15 ట్వీట్లు, పోస్టులు పెడుతుంటానని, ఇప్పటికే నా ట్విట్టర్(ఎక్స్)లో వేల ట్వీట్లు పెట్టానని, వాటి వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారో నాకు తెలియదని.. ప్రస్తుతం నాకు ఆ పోస్టుల గురించి గాని తాను నేను ట్వీట్లు పెట్టానో.. ఎప్పుడు ట్వీట్ చేశానో అందులో ఏముందో కూడా గుర్తు లేదని చెప్పుకొచ్చారు. తాను అంత మర్చిపోయానని.. అయినా ఎప్పుడో రెండు సంవత్సరాల కింద పెట్టిన పోస్టులపై ఇప్పుడు సడన్ గా పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడం ఆశ్చర్యంగా ఉందని, అలాగే అనుమానంగా ఉందని.. అందుకే తాను కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశానని ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.


Similar News