అమ్మ వెళ్లిపోయిందంటూ బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్
బిగ్‌బాస్ బ్యూటీ శ్వేతావర్మ(swethaa varma) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.
దిశ, సినిమా: బిగ్‌బాస్ బ్యూటీ శ్వేతావర్మ(swethaa varma) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు పలు చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో ప్రేక్షకులకు దగ్గరగా ఉంటోంది. తాజాగా, శ్వేతా తన తల్లి మరణంపై ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ‘‘నీ కంపెనీ, ఉనికి బహుమతిగా అనిపిస్తుంది. నీలాంటి వాళ్ళు ఎప్పటికీ నాకు దొరకరు. నేను, నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాము.
నువ్వు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు లేకుండా జీవితం ఏం బాలేదు’’ అని నోట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా తన తల్లి రీసెంట్‌గా చనిపోయిందని సంతాపం తెలుపుతూ కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. దీంతో ఆమె క్లారిటీ ఇచ్చింది. 2017 డిసెంబర్ 2న 2:35 గంటలకు ఉదయం నన్ను వదిలేసి మా అమ్మ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది. అయితే మీ ప్రార్థనలను సైలెంట్‌గా చేయండి కానీ నాకు మెసేజ్‌లు పంపకండి’’ అని వరుస పోస్టులు షేర్ చేసింది.
Read More...
Rakul Preet Singh: ఆ నొప్పిని భరిస్తూనే గడిపాను.. బెడ్‌కే పరిమితమయ్యానంటూ రకుల్ షాకింగ్ కామెంట్స్